AP: అమరావతి చట్టబద్ధత అని కూటమి నేతలు భ్రమ కల్పిస్తున్నారని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతి కోసం అప్పుచేయకుండా ఆచరణ ఎలా సాధ్యమవుతుందన్నారు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం ఎంత అని.. అమరావతిని అవినీతి గనిగా మార్చుకున్నారని మండిపడ్డారు. జగన్ పిలుపుతో మావిగన్‌కు ఒక రూపు వచ్చిందని.. మంచి ప్రతిపాదన అని ప్రజలు అంటున్నారని వెల్లడించారు.