KNR: ఇల్లందకుంట NSUI ఆవిర్భావ దినోత్సవాన్ని మండల అధ్యక్షుడు పసునూటి అన్వేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు అన్వేష్ మాట్లాడుతూ.. 1971 నుంచి విద్యార్థి సమస్యల పట్ల నిరంతరం ఎన్ఎస్ఈయూఐ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.