AP: ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో ఎంపీ కేశినేని చిన్ని పర్యటించారు. ఈ సందర్భంగా రూ.7 కోట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అమరావతి అంటే 33 గ్రామాలు కాదని.. జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నం వరకు విస్తరించిందని తెలిపారు. అమరావతి రాజధానికి జగ్గయ్యపేట ముఖద్వారం అని వెల్లడించారు. గత ప్రభుత్వం రాజధానిని అపహాస్యం చేసిందని పేర్కొన్నారు.