మైక్రోసాఫ్ట్ విండోస్ 11 కొత్త అప్డేట్ వల్ల లక్షలాది మంది యూజర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్నెట్ ఉన్నప్పటికీ వన్‌డ్రైవ్, ఆఫీస్ వంటి యాప్‌లలో ‘నో ఇంటర్నెట్’ అనే ఎర్రర్ వస్తోంది. దీంతో చాలా మంది యూజర్లు లాగిన్ అవ్వలేకపోతున్నారు. ఈ బగ్‌ను గుర్తించిన మైక్రోసాఫ్ట్, త్వరలోనే శాశ్వత పరిష్కారం కోసం కొత్త అప్డేట్ను రిలీజ్ చేస్తామని తెలిపింది.