KDP: YVUలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీపీజీ సెట్-2026కు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 28 వరకు సెట్ కన్వీనర్ పొడిగించినట్లు YVU ప్రవేశాలు సంచాలకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ శనివారం తెలిపారు. ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసుకున్న వారు, చివరి సంవత్సరం పరీక్షలు రాయబోయే వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. YVUలో 29 కోర్సులు ఉన్నాయని ఆయా అర్హతలను బట్టి ఎంపిక చేసుకోవచ్చన్నారు.