NLG: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజకవర్గంలోని పలు మసీదులను సందర్శించి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక పథకాలు అమలు చేశామని గుర్తుచేశారు. నకిరేకల్‌లో షాదీఖానా కోసం కోటి రూపాయలు మంజూరు చేసినా, పనులు చేపట్టలేదని విమర్శించారు.