AP: తిరుమల ల్యాబ్లో అత్యంత ప్రమాణాలు, అత్యాధునిక పరికరాలు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. NABL అక్రెడిటేషన్ వచ్చాక పూర్తిస్థాయిలో పరిశోధనశాల పనిచేస్తుందని వెల్లడించారు. 3 నెలల్లో గుంటూరు, విశాఖలో పరిశోధనశాలను ప్రారంభించాలని ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో లేబరేటరీలను ఆధునీకరించి నాణ్యతలో రాజీపడబోమని పేర్కొన్నారు.