SRD: ఇస్నాపూర్ మున్సిపాలిటీ 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మాధవి పదవిని రద్దు చేస్తూ కలెక్టర్ ప్రావీణ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విప్ ధిక్కరించి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసినందుకు మాధవి పదవిని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపాలిటీ-2019 చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.