BHNG: భూదాన్ పోచంపల్లి మండలం జిబ్లక్పల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కోట మైసమ్మ అమ్మవారి యంత్ర ప్రతిష్ఠా, దేవాలయ పునర్నిర్మాణ నూతన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితులచే స్వామివారి కల్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు.