ASR: పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 43 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ దినేష్ కుమార్ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.