సత్యసాయి: TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప గురువారం ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన కుమారుడు నిమ్మల అంబిరీష్‌తో కలిసి అమరావతిలో మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. హిందూపురం పార్లమెంటు పరిధిలోని పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా వినతులు అందజేశారు.