NDL: బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి ఇవాళ తెలిపారు. పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజల అనంతరం కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. సమావేశానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.