KMR: రాజంపేటలోని ఎల్లమ్మ గుడి వద్ద ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుతూ సర్పంచ్ శ్రీకాంత్ శనివారం కామారెడ్డి డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సు అక్కడ ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వార్డు సభ్యులు, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. స్టేజీ ఏర్పాటుతో భక్తులు, స్థానికులకు రవాణా కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు