KKD: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో MLC అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు తూ.గో జిల్లా కోర్టులో ఊరట లభించింది. ఆమెపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జస్టిస్ గంధం సునీత రద్దు చేశారు. అయితే, ఆమె పాస్ పోర్టును అధికారులు స్వాధీనం చేసుకోవాలని, 15 రోజులకోసారి PSలో హాజరుకావాలని షరతులు విధించారు. వారెంట్ రద్దుపై బాధితుల తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.