BPT: పట్టణంలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో శ్రీ పొట్టి శ్రీరాములు స్టాచు రహదారిపై లారీలు నిలిపివేయడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులతో వాగ్వాదాలకు దిగుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ పోలీసులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.