WGL: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడాని నిరసిస్తూ AIFDS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ మేరకు నగరంలొని సాకరాశికుంట కూడలిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి చుక్క ప్రశాంత్ మాట్లాడుతూ.. రూ.26,674 కోట్లు (8.2%) మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. విద్యరంగానికి కనీసం 15%- 30% నిధుల కేటాయించాలని డిమాండ్ చేశారు.