TG: నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావన లేకపోవడంతో.. నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు, జీపీవో, డీఎస్సీ వంటి జాబ్ నోటిఫికేషన్లు ఇస్తారని నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. ఇప్పట్లో నోటిఫికేషన్లు లేనట్లేనా? అని చర్చించుకుంటున్నారు.