TG: రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 9 లక్షల 45 వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు అందించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. గతంలో ఏడాదికి సగటున 2.5 లక్షల మందికి మాత్రమే సేవలు అందగా, ప్రస్తుతం ఆ సంఖ్య 4 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లింపులను భారీగా పెంచిందన్నారు.