ASF: రెబ్బెన మండలం ఇందిరా నగర్లోని శ్రీ కనకదుర్గ దేవి, మహంకాళి అమ్మవారి దేవస్థానంను జిల్లా సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్ శనివారం సందర్శించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు దేవాయ వినోద్ జడ్జికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి సన్మానించారు. అమ్మవారి ఆశీర్వదాలు ప్రజలందరిపై ఉండాలని కోరారు.