SRCL: అంగన్వాడీ టీచర్ లేకపోవడంతో గర్భిణులు, చిన్నారులు, బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీర్నపల్లి (M) మద్దిమల్ల తండాలో అంగన్వాడీ టీచర్ గతేడాది మృతి చెందింది. అప్పటి నుంచి మరో టీచర్‌ను నియమించకపోవడంతో హెల్పర్‌ను భర్తీ చేస్తూ అంగన్వాడీ సెంటర్‌ను కొనసాగిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉండడంతో కేంద్రం పూర్తిగా మూత పడింది.