విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి ఓ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీకి సంబంధించి నిర్మాణ సంస్థ ఖరారైంది. సాహు గారపాటి నేతృత్వంలోని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే ‘భగవంత్ కేసరి’, ‘మనశంకరవరప్రసాద్ గారు’వంటి బ్లాక్ బస్టర్ అందించిన ఈ బ్యానర్, తాజా ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించనుంది.