ASR: విధి నిర్వహణలో ఉండగానే మృతి చెందిన ఆశా కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాడేరు మండలం మినుములూరు పీహెచ్సీ పరిధిలోని కే.కుమ్మరిపుట్టు గ్రామంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న బట్టి పార్వతమ్మ శనివారం మృతి చెందారు. పలువురు యూనియన్ నేతలు ఆమె మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.