NLR: సంగం చెక్ పోస్ట్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై శనివారం సీఐ శ్రీనివాస రెడ్డి, ఎస్సై రాజేష్ వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి, ఫైన్లు విధించారు. వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు వాహనదారులు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు.