ASF: ఆసిఫాబాద్ జిల్లా SE కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్లు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం రెండో రోజుకు చేరుకుంది. టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మెకు సీఐటీయూ పూర్తి మద్దతు ప్రకటించింది. సంఘం జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ.. ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.