VZM: ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇవాళ ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల వద్ద ఆమె స్వయంగా వినతులను స్వీకరించారు. మొత్తం 48 ఫిర్యాదులు అందగా, అందులో ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 19, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 21 వినతులు, మిగతా శాఖలకు సంబంధించి 8 ఉన్నట్లు తెలిపారు.