SRD: సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాఫూలే జయంతి వేడుకలను ఘనంగా రేపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న ఫూలే విగ్రహానికి పుష్పాలంకరణ చేస్తామని, అనంతరం కల్వకుంట రోడ్డులో బహిరంగ సభ జరుగుతుందని వివరించారు. ఈ కార్య క్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు రావాలని కోరారు.