NDL: సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ చైతన్య రాయలు సూచించారు. శుక్రవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ చట్టం పారదర్శకతను పెంచి అవినీతి రహిత పాలనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు చైతన్యం పొంది తమ హక్కులను వినియోగించుకోవాలని ఆయన కోరారు.