AP: వేసవి దృష్ణ్యా గ్రామాల్లో తాగునీటి సమస్య రావొద్దని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం రూరల్ మండలం వాడపాలెంలో మంత్రి పర్యటించారు. గ్రామాల్లో సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.