గుంటూరు: జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. శనివారం ఆయన గుంటూరు సివిల్ సప్లైస్ ఎల్పీజీ ఏజెన్సీని తనిఖీ చేశారు. కనెక్షన్లు, బుకింగ్స్, సిలిండర్ల నిల్వలను పరిశీలించారు. వినియోగదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు అనవసర ఆందోళనతో ముందుగానే గ్యాస్ బుక్ చేసుకోవద్దని జేసీ సూచించారు.