ఆది సాయికుమార్ ‘శంభాల’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న షైనింగ్ పిక్చర్స్ బ్యానర్, మరోసారి దర్శకుడు యుగంధర్ మునితో మరో ప్రాజెక్టు ప్రారంభించింది. యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం సందీప్ కెరీర్లోనే ప్రతిష్టాత్మక చిత్రంగా నిలవనుంది.