HNK: కాజీపేట మండలం కడిపికొండలో రాజశేఖర్ (51)కుమార్తె రాజశ్రీ (24) సజీవదహనం ఘటన దర్యాప్తులో హత్యగా తేలింది. తొలుత ఆత్మహత్యగా భావించిన ఈ ఘటనలో కట్నం వేధింపుల నేపథ్యంలో రాజశ్రీ భర్త ప్రవీణ్ డీజిల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.