AP: మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో TDPలో భారీ చేరికలు జరిగాయి. పార్వతీపురం పాచిపెంట మండలంలోని 500 గిరిజన కుటుంబాలు టీడీపీలో చేరాయి. వైసీపీ పాలనలో రోడ్లు, తాగునీరు లేక ఇబ్బందులు పడ్డామని ఈ సందర్భంగా గిరిజనులు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి పార్టీలో చేరామని వెల్లడించారు.