MI కెప్టెన్గా పాండ్యా తప్పుకోవాలని కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ముంబై జట్టులో భారత జట్టుకు T20 WCను అందించిన రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ వంటి అనుభవజ్ఞులైన కెప్టెన్లు ఉన్నారని గుర్తు చేశాడు. అందుకే పాండ్యా స్వచ్ఛందంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని, సూర్యకు కెప్టెన్సీ అప్పగించాలని సూచించాడు. ఇది MI భవిష్యత్తుకు మేలు చేస్తుందని పేర్కొన్నాడు