SRHతో మ్యాచ్‌లో RCB బ్యాటర్లు పరుగుల వర్షం కురిపిస్తున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి RCB 126/2 స్కోరు సాధించింది. IPLలో RCBకి ఇది 10 ఓవర్లలో మూడో అత్యధిక స్కోరు. గతంలో 2016లో పంజాబ్‌పై 129/0, 2013లో పూణెపై 128/0 నమోదు చేయగా, ఇప్పుడు తాజా ప్రదర్శనతో మూడో స్థానంలో నిలిచింది. పడిక్కల్(61) అవుటైనా, కోహ్లీ తనదైన ఆటతో ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు.