MDCL: జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. తార్నాక OUలో జరిగిన సదస్సులో నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు చేసి మూర్తిని కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. నిరుద్యోగ భృతి రూ.4000 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఓయూ విద్యార్థులు అందరూ కలిసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతారన్నారు.