SRPT: ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మునగాల మండలంలోని రేపాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, నేడు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు సర్పంచ్ మొగిలిచెర్ల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంప్‌లో పలు రకాల జబ్బులకు వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.