కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పోలీసు కార్యాలయంలో PGRS వేదిక జరిగింది. ఇక్కడ ప్రజల నుంచి ఆయన 156 ఫిర్యాదులు స్వీకరించారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మాట్లాడి.. అర్జీలకు ప్రాధాన్యత ఇచ్చి చట్ట పరిధిలో నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించారు.