MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం వద్ద గల చెక్ డ్యామ్‌లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఒడ్డున ఉన్న బ్యాగు, బట్టలు, కొబ్బరికాయ ఆధారంగా మృతుడిని ఆలయానికి వచ్చిన భక్తుడిగా గుర్తించారు. సదరు వ్యక్తిని ఎవరైనా గుర్తుపడితే తమకు సమాచారం అందించాలని పాపన్నపేట పోలీసులు సూచించారు.