HNK: అంగన్వాడీ కేంద్రాలను ప్రైవేట్ ప్లే స్కూల్స్‌కు ధీటుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు. నాణ్యమైన విద్యా ప్రమాణాలతో బోధన సాగించాలని, 6 ఏళ్ల లోపు చిన్నారులు బోధించిన విషయాలను సులభంగా గ్రహిస్తారని తెలిపారు. బోధనతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అక్షయపాత్ర ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు.