VKB: పరిగిలో కల్తీ కల్లు విక్రయాలను అరికట్టాలని పరిగి BRS కౌన్సిలర్లు కోరారు. ఈ మేరకు వారు శుక్రవారం ఆబ్కారీ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా BRS కౌన్సిలర్లు మాట్లాడుతూ.. పరిగి మున్సిపల్ పరిధిలో విచ్చలవిడిగా నిబంధనలకు విరుద్ధంగా కల్లు విక్రయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే నిందితులపై శాఖాపరమైన చర్యలు తీసుకొవలని అధికారులను కోరుతున్నారు.