NLG: ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆధ్వర్యంలో నకిరేకల్‌లో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. కట్టంగూర్ మండలం కలిమేర గ్రామానికి చెందిన సర్పంచ్, ఉపసర్పంచ్ సహా సుమారు 40 మందికి పైగా ముఖ్య నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరేశం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై తాము పార్టీలో చేరినట్లు నాయకులు వెల్లడించారు.