VZM: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి అత్యవసరంగా ‘O పాజిటివ్’ రక్తం కావాలని తెలుసుకున్న ప్రముఖ కళాకారుడు అనిల్ తెలికిచెర్ల తక్షణమే స్పందించారు. అర్ధరాత్రి సమయమైనప్పటికీ లెక్కచేయకుండా స్థానిక NVN బ్లడ్ బ్యాంక్‌కు చేరుకుని ఆయన రక్తదానం చేశారు. అనిల్‌కు ఇది 99వ రక్తదానం కావడం విశేషం. ఈ సందర్బంగా పలువురు ఆయనను అభినందించారు.