NLG: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నారు. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరి, 7 గంటలకు నల్గొండకి చేరుకుంటారు. అనంతరం ఉదయం 8 గంటలకు నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారని అధికారులు తెలిపారు.