KMM: ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుళ్లుగా సేవలందించి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన నలుగురు పోలీస్ అధికారులను సీపీ సునీల్ దత్ సోమవారం అభినందించారు. ఎస్కే దొరసాని, ఎన్. శ్రీనివాసరాజు, ఆదినారాయణ, జి. నాగేశ్వరరావులకు పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు.