WNP: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముస్తాబైంది. మంగళవారం ఉదయం కలెక్టరేట్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా కార్యాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లైట్ల కాంతులతో కలెక్టరేట్ భవనం సరికొత్త శోభను సంతరించుకుని ప్రత్యేక ఆకర్షణం చేశారు.