KNR: గంగాధర మండలం ఆచంపల్లి గ్రామానికి చెందిన పర్నే సత్యనారాయణకు మహోన్నత సేవా పతకం లభించింది. 1991లో పోలీస్ శాఖలో చేరిన ఆయన, ఏసీబీ, ఇంటెలిజెన్స్ విభాగాల్లో విశిష్ట సేవలందించారు. 2002, 2018లో ఉత్తమ సేవా పతకాలు పొందిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్ ఇంటెలిజెన్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 2026లో ప్రతిష్టాత్మక అవార్డు పొందడం గ్రామానికి గర్వకారణం.