AP: రాజధాని ప్రాంత రైతులతో ఇవాళ మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. అమరావతి పరిధిలోని పెనుమాక, ఉండవల్లి గ్రామాలకు చెందిన రైతులతో ఆయన కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక రైతుల సమస్యలు, రాజధాని భూములు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.