NRPT: మరికల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించారు. అఖిలపక్ష నాయకులతోపాటు అధికారులు పాల్గొన్నారు.