సత్యసాయి: ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో బీసీ కోటా కింద తనకు ఒక అవకాశం ఇవ్వాలని జిల్లా టీడీపీ సీనియర్ నేత గుండుమల తిప్పేస్వామి కోరుతున్నారు. ఈ మేరకు ఆయన పార్టీ అధినేత చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌ను కలసి విన్నవించారు. యాదవ సామాజికవర్గ నాయకుడిగా తనకు ఢిల్లీ వెళ్లే అవకాశం కల్పించాలని తిప్పేస్వామి కోరారు.