MNCL: జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవాన్ని BRS పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను నాయకులు ఎగురవేశారు. వారు మాట్లాడుతూ.. దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలు, అమరుల త్యాగాల ఫలమే తెలంగాణ ఆవిర్బావం అని అన్నారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.